ఆయన జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : ఎంపీ కంగనా

సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ప్రధాని కాలేదనే నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకొని, స్టాక్ మార్కెట్ గురించి అసంతృప్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు ఆయనను ఎప్పటికీ గెలిపించరు. రాహుల్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోతారు అని కంగన ఎద్దేవా చేశారు.