తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్.వి.రమణ రూ.20 లక్షల విరాళం

తీవ్ర వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కులను ఢిల్లీలోని తన నివాసంలో సతీమణి శివమాలతో కలిసి ఆ రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టకరమైన ఘటనపై చితిస్తున్నా. కష్ట సమయంలో ప్రజలంతా మన సోదరులకు చేతనైన సాయం అందించాలని కోరుతున్నా. ముఖ్యమంత్రులు బాధితులను ఆదుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సమాజంలో అశాంతి, ఆకలి ఉంటే ఎంత సంపదా ఉన్నా అనుభవించలేమన్న విషయం గుర్తుంచుకోవాలి. అందువల్ల కష్టాల్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ చేతనైన సాయం చేయాలని చేతులు జోడిరచి అర్థిస్తున్నా. కేంద్ర ప్రభుత్వమూ తెలుగు రాష్ట్రాలను ఉదారంగా ఆదుకోవాలని కోరుతున్నా అని పేర్కొన్నారు.