సుప్రీంకోర్టు జడ్జిలుగా ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం

జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటేశ్వర్‌సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్ సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇద్దరు కొత్త జడ్జీలు రావడంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరిగింది. దీంతో ఖాళీలన్నీ భర్తీ అయ్యాయి.
జస్టిస్ ఎన్.కోటేశ్వర్‌సింగ్ మణిపుర్ నుంచి సర్వోన్నత న్యాయస్థాన జడ్జీగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. 2028 ఫిబ్రవరి వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తమిళనాడులోని వెనుకబడిన తరగతులకు చెందిన జస్టిస్ ఆర్.మహదేవన్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా నియమించడంతో సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనాల్లో భిన్నత్వానికి చోటు కల్పించినట్లు అయ్యింది. ఆయన 2028 జూన్ వరకు పదవిలో కొనసాగుతారు.