రాజ్యసభ నేతగా జేపీ నడ్డా

బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాక మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన గోయల్ లోక్‌సభ సోమవారం లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికారుజన ఖర్గే ఉన్నారు. నడ్డాతో పాటు మరో 11 మంది కేంద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. రాజ్యసభ నేతగా నియమితులైన జేపీ నడ్డాను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అభినందించారు. సభలో అభిప్రాయాలను స్వేచ్ఛగా వినిపించేందుకు ప్రతిపక్షానికి అవకాశం కల్పించాలని నడ్డాను కోరారు.