జేపీసీ లో నలుగురు తెలుగు ఎంపీలకు అవకాశం

వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని నియమించారు. ఇందులో నలుగురు తెలుగు ఎంపీలకు అవకాశం లభించింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( హైదరాబాద్), బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్‌నగర్), టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు (నరసరావు పేట), వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ) సభ్యులుగా ఉంటారు. వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ) పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంరతి కిరణ్ రిజిజు ప్రకటించారు.