జియో సంచలన ఆఫర్.. రూపాయికే
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. రూ.1 ధరకే అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ఫ్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో 100 ఎంబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒకవేళ డేటా పరిమితి ముగిసిపోతే డేటా వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుందని వివరించింది. ఇప్పటివరకు జియో అందిస్తున్న ప్లాన్లలో ఇదే అత్యంత తక్కువ ధర కలిగినది కావడం గమనార్హం. ఆ ఆఫర్ వెబ్‌సైట్‌పై కనిపించింది. మై జియో యాప్‌ను సందర్శించాల్సిందే. అదర్స్‌లో వ్యాల్యూ అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే రూపాయి రీచార్జ్ ప్యాక్ కనిపిస్తుంది. యూజర్లు 1జీబీ డేటా పొందాలనుకుంటే 10 సార్లు రీచార్జ్ చేసుకోవాలి.






