నరేంద్ర మోదీకి అరుదైన బహుమతి

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి అరుదైన బహుమతిగా అందజేసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్ మూడు కిలోల స్వచ్ఛమైన వెండి ఉపయోగించి బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును తయారు చేశారు. అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చడంతో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలన్న ఆలోచన వచ్చిందని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి అయిన చౌహాన్ వెల్లడిరచారు.