Jaishankar : అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం : కేంద్రమంత్రి జైశంకర్

డొనాల్డ్ ట్రంప్ సుంకాల, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (Global Technology Summit) లో అమెరికా (America)తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని వెల్లడిరచారు. గతంలో ట్రంప్ (Trump) పరిపాలనతో నాలుగు సంవత్సరాలు ఈ విషయంలో చర్చలు జరిపినా, ఒప్పందం కుదరలేదన్నా రు. కానీ ప్రస్తుతం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. ఏడాదిలో అమెరికా పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయని, కానీ మరో మార్పు వచ్చిందని, ఇది ఒక పరిణామన్నారు. ఇదీ చైనా ఎదుగుదల అని, అక్కడ బిజినెస్ కథ కూడా టెక్నాలజీ కథేనన్నారు. వాటిలో డీప్ సీక్ ఒకటి. చైనా చేసిన మార్పులు అమెరికా పరిస్థితిల్లో వచ్చిన మార్పులను పోలి ఉన్నాయన్న ఆయన, ఒక వ్యక్తిని మరొకరు కొంతవరకు ప్రభావితం చేస్తారని స్పష్టమవుతోందన్నారు.