BRICS: డాలర్‌పై బ్రిక్స్ నిర్ణయాల్లో భారత్ జోక్యం లేదు: జైశంకర్

డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నాల్లో భారత్ ఎలాంటి పాత్ర పోషించలేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు. బ్రిక్స్ (BRICS) కూటమి సభ్యదేశాలు డాలర్‌పై తీసుకున్న చర్యల్లో భారత్ జోక్యం చేసుకోలేదని ఆయన పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. “బ్రిక్స్ (BRICS) కూటమి గత రెండు దశాబ్దాలుగా తన సభ్యత్వం, ఎజెండా ఆధారంగా విస్తరిస్తూ అంతర్జాతీయ వేదికగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయిలో బ్రిక్స్ కార్యకలాపాలపై అవగాహన పెంచేందేకు మా వంతు ప్రయత్నాలు మేం చేస్తున్నాం. ఇది సభ్యదేశాల ప్రయోజనాలను ప్రతిబింబించే వేదిక. ప్రపంచదేశాలతో కలిసి ఎదగడమే మా లక్ష్యం. డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నాల్లో భారత్ ఎలాంటి పాత్ర పోషించడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం,” అని జైశంకర్ (Jaishankar) తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే బ్రిక్స్ (BRICS) కూటమిపై మండిపడ్డారు. డాలర్‌తో ఆటలు ఆడాలని చూస్తే వాణిజ్య పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “డాలర్‌పై దాడి చేయడం భారత్ వ్యూహాత్మక లేదా ఆర్థిక విధానంలో భాగం కాదు. అమెరికాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇదివరకే ఈ విషయం స్పష్టంగా తెలియజేశాం. బ్రిక్స్‌లో కామన్ కరెన్సీ తీసుకురావడంలోనూ భారత్ ఎలాంటి పాత్ర పోషించట్లేదు” అని జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు.