ఇన్ఫోసిస్ శుభవార్త… ఉద్యోగులకు భారీగా
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ నెల నుంచి ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. దీంతో కంపెనీ నుంచి వలసలను తగ్గించేందుకుగాను ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతనాలను పెంచేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమైనట్లు సమాచారం. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్పోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనే అవకాశం ఉంది.






