Indonesia :గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) హాజరవ్వనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ (Republic Day Parade )లో ఇండోనేషియా పాల్గొననుంది. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఇండోనేషియా (Indonesia )కు చెందిన 160 మంది సభ్యుల కవాతు బృందం, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనుందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. పరేడ్‌లో సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలు, సహాయక పౌర బలగాలు, ఎన్‌సీసీ(NCC), ఎన్‌ఎస్‌ఎస్ బృందాలు పాల్గొంటాయి. స్వదేశీ వాయిద్యాలతో కళాకారులు దేశభక్తి గీతాలను ఆలపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.