సెప్టెంబర్ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం

దేశ వ్యాప్తంగా ఈ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్‌పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. రేపటి అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేసినట్లు ఆమె వెల్లడించారు. దరఖాస్తుదారులకు నేరుగా సంక్షిప్త సమాచారం పంపామని వెల్లడిరచారు. సెప్టెంబర్ 2 నుంచి యథావిధిగా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్‌పీవో పేర్కొన్నారు.