Marco Rubio : భారత్‌తో బలమైన బంధానికి అమెరికా ప్రాధాన్యం : రుబియో

అమెరికా కొత్త విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio)తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) సమావేశమయ్యారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుబియో జరిపిన మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశం జైశంకర్‌తోనే కావడం, భారత్‌తో సంబంధాలకు అమెరికా(America) ఎంత ప్రాధాన్యమిస్తోందో తెలియజేస్తోంది. వారిద్దరూ ప్రాంతీయ సమస్యల పైనా, అధునాతన సాంకేతికతలు, రక్షణ, ఇంధన రంగాలలో సహకారం, ఇండో పసిఫిక్ భద్రత గురించి చర్చించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ (Tommy Bruce) తెలిపారు. అలాగే అక్రమ వలసల గురించీ చర్చించారని వివరించారు. భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోదలచినట్లు ప్రకటించారని తెలిపారు. జైశంకర్ అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై ట్రంప్ ప్రమాణస్వీకారాని హాజరయ్యారు.