Passport :పాస్ పోర్టు సూచీలో కిందకు జారిన భారత్ ర్యాంకు

ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత (India) ర్యాంకు ఈ ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 80వ ర్యాంకు కలిగివుంది. సింగపూర్‌కు పాస్‌పోర్టు సూచీలో ఒకటో ర్యాంకు లభించింది. హెన్లీ అండ్ పార్టనర్స్ అనే పౌర సలహాల సంస్థ ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్టు సూచీ అందించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వరుసగా 103, 101 స్థానాల్లో, అమెరికా 9, చైనా 60, జపాన్ 2, కెనడా 7 స్థానాల్లో నిలిచాయి.