జులై 22న కేంద్ర బడ్జెట్ !

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందట. కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం అయిదు పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్ట, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.