Piyush Goyal: అమెరికా విషయంలో.. భారత్ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోంది : పీయూష్ గోయల్

అమెరికా సుంకాల విషయంలో భారత్ (India) చాలా తెలివిగా వ్యవహరిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. అమెరికాతో వాణిజ్యాన్ని రెండున్నర రెట్లు పెంచుకోవడం పై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. వివిధ దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు నిలిపివేసిన వేళ ఆయన ముంబయి (Mumbai)లో మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలపై మధ్య ద్వైపాక్షి సంబంధాలను, సులభతర వాణిజ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమక్షంలో ఇరు దేశాలు ఫిబ్రవరిలోనే ఓ ఒప్పందం చేసుకున్నాయని గోయల్ అన్నారు. దీనివల్ల ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నా రు. గతంతో పోలిస్తే ఈ మొత్తం రెండున్నర రెట్లు అధికం అన్నారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని గోయల్ పేర్కొన్నారు.