ఎయిరిండియా కొత్త బాస్
ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో, ఎండీ నియామకం అయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ ప్రకటన విడుదల చేసింది. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ బోర్డు సమావేశానికి చంద్రశేఖరన్ అధ్యక్షత వహించారు. ఐకెర్ ఆయ్‌సీని ఎయిర్ ఇండియాకు కొత్త బాస్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్వేస్కు చీఫ్‌గా ఐకెర్ ఆయ్సి బాధ్యతలు నిర్వర్తించారు. టర్కీ టు టాటా ఇండియాకు ఆయన వచ్చారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడ్తారని ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటాసన్స్ చెప్పుకొచ్చింది.






