దేశంలోనే అతి పెద్ద విరాళం… ఇచ్చిన ఏపీ వాసీ

ఐఐటీ-మద్రాసుకు పూర్వ విద్యార్థి, ఇండో-ఎంఐఎం వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్లు విరాళంగా అందజేశారు. చెన్నైలోని సంస్థ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ నిధులతో ఐదు పథకాలను అమలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద విరాళమని ఐఐటీ`మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి అన్నారు. ఆయన గౌరవార్థం అకడమిక్ బ్లాక్‌కు కృష్ణ చివుకుల బ్లాక్‌గా పేరు పెట్టినట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణ ఐఐటీ`బాంబే, ఐఐటీ`మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు. పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలో శివ టెక్నాలజీస్, బెంగుళూరులో ఇండో` మెటల్ ఇంజక్షన్ మోల్డింగ్ ప్రారంభించారు. ఎందరికో ఉద్యోగాలిచ్చారు.