మాకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే.. వారంతా జైలుకు

తమకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే వారంతా జైల్లో ఉండేవారు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ 400 అంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికి వెళ్లారు? వారి సీట్లు 240కి పడిపోయాయి. మాకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే, వారంతా జైలుకు వెళ్లేవారు. వారు జైలుకెళ్లడానికి అర్హులు అని ఖర్గే మాట్లాడారు. అయితే ఆయన ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. కొద్దినెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్థానాలు 240కి పరిమితం కావడం తెలిసిందే.