యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుడాన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాన్.. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.