Sudhamurthy : త్రిభాషా సూత్రానికి ఎంపీ సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు(Tamil Nadu )- కేంద్ర ప్రభుత్వాల(Central Government) మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ (Parliament Budget) సమావేశాల్లోనూ దీనిపై ఎంపీల (MPs) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, ప్రముఖ వితరణశీలి సుధామూర్తి (Sudhamurthy) దీనిపై మాట్లాడుతూ త్రిభాషా సూత్రాన్ని కి మద్దతు పలికారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం పిల్లలకే మంచిదన్నారు. ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలని సూచిస్తాను. నాకు 7-8 భాషలు వచ్చు. నేర్చుకోవడాన్ని నేను చాలా ఇష్టపడతా. పిల్లలు కూడా దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు అని సుధామూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందీ వివాదం వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.