Jnanpith Award: హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రఖ్యాత హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా (Vinod Kumar Shukla) ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు (Jnanpith Award) (59వ జ్ఞానపీఠ్ పురస్కారం) కు ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి జ్ఞానపీఠ్ గెలుచుకున్న తొలి రచయితగా శుక్లా గుర్తింపు పొందారు. భారతీయ సాహిత్యంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా అందించే అత్యున్నత గౌరవమే జ్ఞానపీఠ్ (Jnanpith Award) అవార్డు. 1944లో ప్రారంభమైన ఈ పురస్కారాన్ని భారత సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా పరిగణిస్తారు. ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయితగా శుక్లా నిలిచారు. ఈ పురస్కారం కింద రూ. 11 లక్షల నగదు, సరస్వతి దేవి కాంస్య విగ్రహం ఆయనకు ప్రదానం చేయనున్నారు. శుక్లా హిందీ సాహిత్యంలో తన ప్రత్యేకమైన రచనా శైలి, విలక్షణమైన ప్రయోగాలతో ఎంతోమందిని మెప్పించారు. 1999లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. గతేడాది జ్ఞానపీఠ్ అవార్డును (Jnanpith Award) ఉర్దూ కవి, సినీ గేయ రచయిత గుల్జార్ (Gulzar), సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య (Jagadguru Rambhadracharya) అందుకున్న సంగతి తెలిసిందే.