మమతా జీ త్వరగా ఆ పని చేయండి : హేమమాలిని

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నటీ, బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు. హత్యాచార ఘటనను ఖండిరచారు. బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలంటూ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌లో చాలా పెద్ద తప్పు జరిగింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. వారికి నేను మద్దతు ఇస్తున్నా. ఈ ఘటనపై ఆలస్యం చేయడం సబబు కాదు. మమతా జీ వీలైనంత త్వరగా న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని మిమల్ని అభ్యర్థిస్తున్నా. జూనియర్ వైద్యురాలి మృతికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడాల్సిందే. ఆ రోజు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది అని హేమమాలిని డిమాండ్ చేశారు.