హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి 10 శాతం రిజర్వేషన్లు

అగ్నిపథ్ పథకం పై హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్ గార్డు, జైలు వార్డెన్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. అంతేకాకుండా వయసు సడలింపుతో పాటు ఇతర రాయితీలు ఉంటాయన్నారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డు, ఫారెస్టు గార్డు, జైలు వార్డెన్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గ్రూప్ సీ పోస్టుల్లో 5 శాతం రిజర్వేషన్‌తో పాటు గ్రూప్ సీ, డీ పోస్టుల్లో వయోపరిమితిలోనూ మినహాయింపు ఇవ్వనున్నాం. తొలి అగ్నివీర్ బ్యాచ్‌కు మాత్రం ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అదేవిధంగా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందించనున్నాం అని సీఎం పేర్కొన్నారు.