చంద్రబాబుతో గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు స్వాగతం పలికిన చంద్రబాబు.. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులు వీరి మద్ద చర్చకు వచ్చినట్టు సమాచారం.