ఉపరాష్ట్రపతిని కలిసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ ఉపరాష్ట్రపతిని కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గవర్నర్ జిష్ణుదేవ్ ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే.