భారత పౌరసత్వం అందుకున్న పాకిస్థానీ

ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ పెరీరా గోవాకు చెందినవారైనా పాక్‌లో ఉండటంతో పౌరసత్వం విషయంలో ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం-2019 ప్రకారం పెరీరాకు పౌరసత్వం లభించిందన్నారు. గోవా నుంచి పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తి పెరిరా అని సావంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి రోహన్ అశోక్ ఖౌంటే పాల్గొన్నారు.