గౌతమ్ అదానీ వారసులొచ్చేస్తున్నారు

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. 70 ఏళ్ల వయసులో బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. 2030లో తన కుమారులకు వ్యాపారాలను అప్పగించనున్నట్లు తెలిపారు. బాధ్యతల బదిలీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా, సజావుగా జరగాలని రెండో తరానికి సూచించినట్లు అదానీ పేర్కొన్నారు. గౌతమ్ అదానీకి ఇద్దరు సోదరులున్నారు. వినోద్ అదానీ అందరిలోకెల్లా పెద్దవారు. ఆయనకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలున్నాయి. ఈయన వారసుడు ప్రణవ్. అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్‌గా, అగ్రో ఆయిల్, గ్యాస్ వ్యాపారాలకు ఎండీగా ఉన్నారు.
మరోవైపు రాజేశ్ అదానీ అందరికంటే చిన్నవాడు. ఆయన ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎండీగా ఉన్నారు. ఈయన కుమారుడు సాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక గౌతమ్ అదానీ కుమారులైన కరణ్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు ఎండీగా, జీత్ అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.