ముకేష్ కు ఝలక్ ..ఆసియాలోనే టాప్ కుబేరుడిగా గౌతమ్
దేశంలోనే కాదే ఏషియాలోనే నంబర్ వన్ సంపాదనపరుడి హోదాలో కొనసాగుతున్న ముకేశ్ అంబానీకి మరో గుజరాతి గౌతమ్ అదానీ ఝలక్ ఇచ్చారు. ఆసియాలో అత్యధిక సంపద కలిగిన కుబేరుడిగా ఉన్న ముకేష్ అంబానీని అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ వెనక్కి నెట్టారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. తాజాగా గౌతం అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. ఫిబ్రవరి 8వ తేదీ నాటికి గౌతమ్ అదానీ సంపద 88.5 బిలియన్ డాలర్ల (రూ.6.59 లక్షల కోట్లుగా) ఉంది. ముకేష్ కంటే దాని సంపద 600 మిలియన్లు (రూ.4500 కోట్లు) ఎక్కువగా నమోదయ్యింది. దీంతో ఏషియాలోనే నంబర్ వన్ ధనవంతుడిగా అదానీ నిలిచారు. అదానీకి రాజకీయ మద్దతు ఇదే స్థాయిలో కొనసాగితే సమీప భవిష్యత్తులో అదానీ సంపద మరిన్ని రెట్లు పెరుగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. వీరివురి సంపదల మధ్య స్వల్ప తేడానే ఉండడంతో ఈ స్థానాలు రోజుల వ్యవధిలోనే తారుమారయ్యే అవకాశం లేకపోపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.






