ఈ వినాయకుడి బీమా రూ.400 కోట్లు

గణేశ్ ఉత్సవాలకు ముంబై పెట్టింది పేరు. అసలు సిసలు గణేష్ ఉత్సవాలు ముంబైలోనే జరుగుతుంటాయి. అంత రేంజ్‌లో సన్నాహాలు చేస్తుంటారు. భారీ వినాయక విగ్రహాలకు దీటుగా వాటికి బీమా కూడా చేయిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్‌బీ మండల్ చేసినట్లు తెలిసింది. ఈ బీమా ధర రూ.400.58 కోట్లు. బీఎస్‌బీ సేవా మండల్ ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. జీఎస్బీ రాజా ప్రసిద్ధ గణపతి పండాల్లో ఒకటి. వీటిని 5 రోజుల పాటు ముంబైలోని కింగ్ సర్కిల్ ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది రూ.400 కోట్ల బీమా చేయించడం విశేషం. పండల్‌కు వచ్చే భక్తులు, వాలంటీర్లు, వంటవారు, సేవా సిబ్బంది, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది. స్టాల్ కార్మికులకు ఈ బీమా వర్తించనున్నది. జీఎస్బీ సేవా మండల్ ఈ సంవత్సరం తన 70వ వార్షిక గణేషోత్సవాన్ని జరుపుకుంటుంది. సెప్టెంబర్ 5న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గత ఏడాది ఈ పండల్ రూ.360.40 కోట్ల బీమా రక్షణను తీసుకున్నది.