జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం …బీజేపీలో చేరిన మాజీ సీఎం

జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, రaార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో చంపాయీ సోరెన్ తన మద్దతుదారులతో కలిసి పార్టీలో చేరారు. కాషాయ పార్టీలోకి స్వాగతించిన తర్వాత సోరెన్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది.
జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంపాయీ కొంతకాలంగా ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంపాయీ వైదొలగారు. సీఎం పగ్గాలు మళ్లీ హేమంత్ సోరెన్ చేతికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో సొంత పార్టీ అధినాయకత్వంపై చంపాయీ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్న చంపాయీ తాజాగా బీజేపీలో చేరిపోయారు.