చండీగఢ్ కోర్టులో అనూహ్య ఘటన

చండీగఢ్ న్యాయస్థానంలో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై అతడి మామయ్య కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితులు ప్రాణాలు కోల్పోయాడు.
హర్‌ప్రీత్ సింగ్ నీటిపారుదల శాఖలో ఐఆర్‌ఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడి మామ మాల్విందర్ సింగ్ సిద్ధూ పంజాబ్ పోలీసు అసిస్టెంట్ ఐజీగా పని చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు. కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య కలహాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. వారి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సెషన్‌కు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే సిద్ధూ బాత్‌రూంకి వెల్లాంటూ బయటకు వచ్చాడు. అంతలో అక్కడికి వచ్చిన అల్లుడిపై కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ శబ్దం వినిపించడంతో లోనికివెళ్లిన వారంతా షాక్‌కి గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న హర్‌ప్రీత్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పారిపోకుండా బంధించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కానీ, ఆస్పత్రికి వెళ్లే మార్గంలోనే బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.