బ్రెయిన్ సెంటర్ కు రూ.41 కోట్ల విరాళం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లోని సుధా గోపాల కృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌కు ఐఐటీఎం పూర్వ విద్యార్థి, కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రేమ్‌వత్స 5 మిలియన్ల యూఎస్ డాలర్లు ( సుమారు రూ.14 కోట్లు) విరాళంగా అందించారు. ప్రేమ్ 1971లో ఐఐటీఎంలో చదివారు. కెమికల్ ఇంజినీరింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ మానవ మెదడులోని సెల్యులార్ స్థాయిపై పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రేమ్ సహకారం అందించినట్లు వెల్లడిరచారు.