Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంటిపై ఈడీ సోదాలు.. అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి!

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel), ఆయన కుమారుడు చైతన్య నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల బృందంపై దాడి జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ కార్యకర్తలే (Congress workers) ఈడీ అధికారులపై దాడి చేసినట్లు తెలస్తోంది. మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగానే బఘేల్, ఆయన కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు జరిగినట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున బఘేల్ (Bhupesh Baghel) నివాసంతో పాటు వారికి సంబంధించిన 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. బిలాయి ప్రాంతంలో ఉన్న ఆయన కుమారుడు చైతన్య బఘేల్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ సోదాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ సీఎం భూపేశ్ (Bhupesh Baghel) ఇంటి బయట నిరసనలు చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు అక్కడున్న పోలీసు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారితో గొడవకు దిగిన కార్యకర్తలు.. దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.