Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

దేశ రాజధాని ఢిల్లీ (Delhi )లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ప్రకటించింది. 70 శాసనసభ స్థానాలున్న(70 Assembly seats) ఢిల్లీ కి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ (Rajiv Kumar) వెల్లడిరచారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.