Trade Deals: ట్రేడ్ డీల్స్ ప్రస్తుత ప్రపంచంలో చాలా ముఖ్యం: జైశంకర్

వాణిజ్య ఒప్పందాలు (Trade Deals) ప్రస్తుత కాలంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వీటి ప్రాముఖ్యత పెరిగిపోతున్నదని ఆయన తెలిపారు. “ప్రస్తుతం భారత్ మూడు కీలక వాణిజ్య ఒప్పందాలపై (Trade Deals) చర్చలు జరుపుతోంది. ఐరోపా సమాఖ్య, యూకేతో ఎఫ్‌టీఏ, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తున్నాం. ఇటీవలే న్యూజిలాండ్‌తోనూ చర్చలు ప్రారంభించాం,” అని వెల్లడించారు. ఇలాంటి ఒప్పందాల (Trade Deals) ద్వారా వచ్చే లాభాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచించారు. సున్నితమైన టెక్నాలజీ విషయంలో ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా ఒప్పందాలను రూపొందించాలన్నారు. “ఇకపై భారత్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. గతంలో ఎక్కువగా ఆసియా దేశాలతో ఒప్పందాలు (Trade Deals) చేసుకున్నాం. కానీ గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లో మిగులు సాధించాం,” అని జైశంకర్ (Jaishankar) వివరించారు. ప్రతీకార సుంకాల అమలుకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, భారత్ వాణిజ్య ఒప్పంద (Trade Deals) చర్చలను వేగవంతం చేస్తోందని జైశంకర్ (Jaishankar) వివరించారు.