Ajit Pawar: పాదాలు తాకించుకునే అర్హత.. నేటితరం నేతలకు లేదు: అజిత్ పవార్

తల్లిదండ్రులు, బాబాయ్ ఆశీస్సులతోనే తాను బాగున్నానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) చెప్పారు. ఎన్సీపీ యువజన విభాగం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పార్టీ కార్యకర్తలు తనకు పూలదండలు, మొమెంటోలు, శాలువాలు అందించడం చూసి అసహనం వ్యక్తం చేశారు. నేటితరం రాజకీయ నేతలకు ఈ విధమైన గౌరవాన్ని పొందే అర్హత లేదని, వారి పాదాలు తాకవద్దని స్పష్టంగా చెప్పారు. “నాకు మీ అభిమానం, గౌరవం మాత్రమే కావాలి. నా పాదాలు తాకవద్దు. నేటి రాజకీయ నాయకులు ఆ అర్హతను సంపాదించుకోలేదు. నేను నా కుటుంబ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాను. మీ ప్రేమ, గౌరవమే నాకు చాలు,” అని ఆయన (Ajit Pawar) తెలిపారు. 2023లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని వీడిన అజిత్ పవార్ Ajit Pawar.. గతేడాది బీజేపీ-శివసేన కూటమితో కలిసి ఎన్నికల్లో నెగ్గారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో డిప్యూటీ సీఎంగా పదవి నిర్వహిస్తున్నారు.