Om Birla: ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధం : స్పీకర్ ఓం బిర్లా

ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు (T-shirts) ధరించి లోక్‌సభ (Lok Sabha)కు రావడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) అసహనం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. నిబంధనలు, విధానాలతో సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ, ప్రతిపక్ష పార్టీలోని కొంతమంది ఎంపీలు (MPs) నిబంధనలు పాటించడం లేదు. ఇది సరైనది కాదు. ఎంత పెద్ద నాయకుడైనా సభ గౌరవాన్ని తగ్గించే ఇలాంటి దుస్తులు ధరించడం ఆమోదయోగ్యం కాదు అని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ, సభ్యులు బయటకు వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలని సూచించారు.