స్మృతి ఇరానీ పై అలా మాట్లాడొద్దు : రాహుల్

లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అధికారిక బంగ్లా ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలువురు విమర్శలు చేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఆమెను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. జీవితంలో గెలుపోటములు సంభవిస్తుంటాయి. ఈ విషయంలో స్మృతి ఇరానీతో పాటు ఇతర నేతలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు. దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. ఇతరులను కించపరడం, అవమానించడం బలహీనతకు సంకేతం అని పేర్కొన్నారు.