Bill Gates: బిల్‌గేట్స్ సంచలన ప్రకటన.. నా ఆస్తిలో పిల్లలకు అంతే ఇస్తా

సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు వారి వారుసులైన పిల్లలకు చెందుతుంటాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తిలో ఎంత ఇవ్వనున్నారో ఒక పాడ్‌కాస్ట్ (Podcast) లో మాట్లాడుతూ వెల్లడిరచారు. తన పిల్లలకు మంచి విద్య (Education)ను అందించానని, తండ్రి కూడ బెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం ఉందని, అందుకు తాను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే తక్కువగానే పిల్లలకు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇదేమి వారసత్వం కాదని, మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తించమని వారిని అడగడంలెదని, వారు సొంతంగా సంపాదించుకోవడానికి, విజయ సాధించడానికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మన ప్రేమతో వారిని గందరగోళంలోకి నెట్టివేయకూడదని బిల్‌గేట్స్ చెప్పారు. వారికి కల్పించే అవకాశాలపై స్పష్టత ఇచ్చి వారు సొంతంగా ఎదిగేలా సిద్ధం చేయాలని గేట్స్ అభిప్రాయపడ్డారు.