రామ్‍దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు…

యోగా గురు రామ్‍దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎమ్‍ఏ) రామ్‍దేవ్ బాబాపై పోలీసు కంప్లెంట్ ఇచ్చింది. ఆయన అల్లోపతిపై తప్పుడు, అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్‍లో పేర్కొంది. ఆమోదింపబడ్డ పద్దతిలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై, ఉపయోగిస్తున్న మందులపై తరచూ ఉద్దేశపూర్వకంగా ఆయన నిరాధార, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన దావాపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయం వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది.
కాగా కొరోనిల్ టాబ్లెట్‍పై రామ్‍దేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ డీఎంఏ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. కొరోనిల్‍తో కరోనా తగ్గుతుందా లేదా అన్నది నిపుణులు తేల్చాలి. కొరోనిల్‍కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.