Kejriwal :ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం : కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Assembly Election Schedule) విడుదలైన నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆప్ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందిస్తూ ఇది అభివృద్ధికి, అధికార దుర్వినియోగానికి మధ్య జరుగుతోన్న పోరు అని పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన ఆయన, తాము చేసిన అభివృద్ధి రాజకీయాల పట్ల ఓటర్ల విశ్వాసం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీలు వచ్చేశాయి. కార్యకర్తలందరూ ఉత్సాహంతో, పూర్తి శక్తితో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలి. మీరే మా బలం. మీ అభిరుచి ముందు వారి వ్యవస్థలన్నీ విఫలమవుతాయి. ఇది అభివృద్ధికి, అధికార దుర్వినియోగానికి మధ్య జరుగుతోన్న పోరు. మేము చేసిన అభివృద్ధి పట్ల ఢిల్లీ ప్రజలు విశ్వాసం చూపుతారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం అని అన్నారు.