ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత.. ప్రపంచంలోనే
దేశ రాజధాని ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్లలో ఢిల్లీ విమానాశ్రయం రెండో స్థానానికి ఎగబాకింది. 2022 మార్చి నెలకు గానూ గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ సంస్థ ఆఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్ (ఓఏజీ) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా అమెరికాలో అట్లాంటా ఎయిర్ పోర్ట్ నిలిచింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు రెండో స్థానానికి ఎగబాకడంతో అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూడో స్థానానికి పడిపోయింది. 2019లో 23వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం.






