కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. టెస్లా ఎంట్రీపై
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు టెస్లా సిద్ధమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధిక ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. అధిక దిగుమతి సుంకాలపై ఇప్పటికే టెస్లా ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భారత్లోకి టెస్లా ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
దిగుమతి సుంకాలపై ఎంతమేర కోత పెట్టవచ్చుననే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నీతి ఆయోగ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. టెస్లా ప్రాతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాలు పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చ జరుపుతున్నట్లు ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరిన విషయం తెలిసిందే. టెస్లాతో పాటుగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా దిగుమతి సుంకాలపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరింది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా వాదిందించి. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫర్ సర్చార్జిని కూడా మాపీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసిందే. విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60`100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుపుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది.






