రాష్ట్రపతితో రాహుల్ గాంధీ భేటీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేసింది. సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రపతిలో రాహుల్ గాంధీ భేటీ కావడం ఇదే తొలిసారి.