రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఫ్వీు ప్రమాణం

తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్‌మను సింఫ్వీు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన ఛాంబర్‌లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్రమంత్రి, బీజేపీ రాజ్యసభాపక్షనేత జేపీ నడ్డా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ తివారీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ పాల్గొన్నారు.