AICC: కాంగ్రెస్ కొత్త కార్యాలయం -ఇందిరా భవన్

139 ఏళ్ల కాంగ్రెస్.. ఎట్టకేలకు కొత్త కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌ను ..సోనియా గాంధీ(sonia), పార్టీ అధ్యక్షుడు ఖర్గే(kharge) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ తన కేంద్ర కార్యాలయాన్ని 9A కోట్ల రోడ్‌కి మార్చినట్లైంది. ఇది 47 ఏళ్లుగా 24 అక్బర్ రోడ్(akbar road) వద్ద కొనసాగింది.139 ఏళ్ల పార్టీకి పర్యాయపదంగా మారిన చిరునామా. ఎన్నో ఒడిదుడుకులను చూసింది.
9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.
ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది. (National News)
ఈ భవనంలో మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI వంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంస్థల కార్యాలయాలు కూడా ఉంటాయి. 26 అక్బర్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ సేవాదళ్ కార్యాలయాన్ని కూడా తీసుకురానున్నారు. పార్టీకి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని సిద్ధం చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు.