India: భారత్ పై వాటర్ బాంబ్

ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ (Hydroelectric dam) నిర్మాణానికి చైనా (China) ఆమోదం తెలిపింది. టిబెట్ తూర్పు అంచులో యార్లంగ్ జంగ్బో (Yarlung Zangbo River ) నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020 లో ఆ దేశానికి చెందిన పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్దదైన త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్త జలాశయం సామర్థ్యం దానికి మూడురెట్లు అధికం.