టాటా సన్స్ చైర్మన్ గా మళ్లీ చంద్రశేఖరన్

టాటా సన్స్ చైర్మన్‌గా ఎస్.చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2017లో నాయకత్వ సంక్షోభం మధ్య బాధ్యతలు స్వీకరించిన ఆయన ఐదేళ్ల తన కాలాన్ని సమర్థంగా నిర్వహించారు. అప్పటి నుంచి టీసీఎస్ బాధ్యతలు చూస్తున్న చంద్రశేఖరన్ టాటా గ్రూప్‌లో సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే నమ్మకంతో బోర్డు ఆయనకు టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. సైరస్ మిస్త్రీ నుంచి సంస్థకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను చంద్రశేఖరన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. అప్పటికే టీసీఎస్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న ఆయనకు టాటా సన్స్‌లో మంచి ఆదరణ లభించింది. పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాముల నుంచి విశ్వాసం చూరగొన్నారు. న్యాయపరమైన వివాదాలతో మసకబారిన టాటా గ్రూప్ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చారు. టాటాల సంస్థలో అంతటి ఆదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.