Parliament: పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంపు

పార్లమెంటు సభ్యులకు ప్రతి నెల అందే వేతనాలు, పెన్షన్లును కేంద్రం పెంచింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల(MPs) జీతాన్ని దాదాపు 24 శాతం మేర పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూ.లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరగనుంది. అలాగే, సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యాన్ని రూ.2వేల నుంచి 2,500కు పెంచుతున్నట్లు పేర్కొంది. మాజీ పార్లమెంటు సభ్యుల (Former members of parliament ) కు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.25 వేల నుంచి రూ.31 వేలకు పెంచుతున్నట్లు నోటిఫికేషన్ (Notification) లో వెల్లడిరచింది. పెంచిన ఈ వేతనాలను 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.